Zomato: సెన్సెక్స్ 30లోకి జొమాటో ఎంట్రీ.. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల్లో కొత్తగా 43 స్టాక్స్ కు చోటు..!
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) త్వరలో సెన్సెక్స్ 30లోకి ఎంట్రీ అవ్వనుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) త్వరలో సెన్సెక్స్ 30(Sensex 30)లోకి ఎంట్రీ అవ్వనుంది. ఈ విషయాన్ని భారతదేశపు పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సూచీలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్(JSW Steel) ప్లేసులో జొమాటో రీప్లేస్(Replace) కానుందని, డిసెంబర్ 23 నుంచి ఈ కొత్త మార్పు అందుబాటులోకి రానుందని తెలిపింది. కాగా శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో షేర్ వాల్యూ 0.72 శాతం తగ్గి రూ. 265 వద్ద ముగిసింది. ఈ సంవత్సరంలో ఈ సంస్థ షేర్ విలువ ఏకంగా 136 శాతం పెరిగింది.
ఇదిలా ఉంటే సెన్సెక్స్ 30తో పాటు బీఎస్ఈ 100, బీఎస్ఈ 50, బీఎస్ఈ నెక్స్ట్ 50 సూచీల్లో కూడా బీఎస్ఈ(BSE) పలు మార్పులు చేపట్టింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టు(F&O Contract)ల్లో కొత్తగా 43 స్టాక్స్(Stocks)కు అవకాశం కలిపించింది. ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, యెస్ బ్యాంక్, వన్ 97 కమ్యూనికేషన్స్, డీమార్ట్ , జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ తదితర షేర్లు ఉన్నాయి. డిసెంబర్ 13 నుంచి ఈ కొత్త కాంట్రాక్టులు స్టార్ట్ కానున్నాయి. కాగా సెన్సెక్స్ మొత్తం 30 కంపెనీలను కలిగి ఉంటుంది. లిక్విడిటీ, మార్కెట్ క్యాపిటలైజేషన్, రాబడి, వైవిధ్యత ఆధారంగా ఈ 30 కంపెనీలను ఎంపిక చేస్తారు. అలాగే ఒక కంపెనీ సెన్సెక్స్‌లో ఉండాలంటే బిఎస్‌ఇలో లిస్ట్ అయి ఉండాలి.