Forex Reserves: నాలుగు నెలల కనిష్టానికి భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
భారత విదేశీ మారక(Forex Reserves) నిల్వలు కొత్త కనిష్టాలకు చేరాయి.
దిశ, వెబ్‌డెస్క్: భారత విదేశీ మారక(Forex Reserves) నిల్వలు కొత్త కనిష్టాలకు చేరాయి. గత వారంలో ఏకంగా 17.8 బిలియన్ డాలర్లు మేర పతనమయ్యాయి. దీంతో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 657.89 బిలియన్ డాలర్లకు చేరుకొని నాలుగు నెలల కనిష్ట స్థాయిని తాకాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఇండియా(RBI) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ(Republican Party) నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విజయం తర్వాత డాలర్ విలువ(Dollar Value) క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రూపాయి విలువను బలపరిచేందుకు ఫారెక్స్ మార్కెట్(Forex Market)లో ఆర్బీఐ తన నిల్వలను అమ్మకాలకు ఉంచుతోంది. దీంతో విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గిపోతన్నాయి. ఇక గోల్డ్ రిజర్వు(Gold Reserves) నిల్వలు 2 బిలియన్ డాలర్లు క్షీణించి 65.7 బిలియన్ డాలర్ల వద్ద ముగియగా.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF)లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 51 మిలియన్ డాలర్లు తగ్గి 4.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.42 దగ్గర ముగిసింది.