Small Savings Schemes: స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లు యథాతథం: కేంద్ర ఆర్థికశాఖ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇటీవల కాలంలో పోస్టాఫీస్ పథకాలు(Post Office Schemes) లేదా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్(SSS)లో మనీ ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటిలో పెట్టుబడి పెడితే వడ్డీ రేటు ప్రకారం మంచి రిటర్న్స్(Returns) రావడంతో పాటు ఎలాంటి రిస్క్ ఉండదు. ఇక ఇందులో చిన్న మొత్తాల్లో డిపాజిట్లు(Deposits) చేసే అవకాశముండటంతో చాలా మంది ఈ స్కీమ్స్‌లో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే కేంద్రం ప్రతీ మూడు నెలలకు ఒకసారి వీటిపై వడ్డీ రేట్లను(Interest Rate) తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా.. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్(Quarter) ముగిసిన నేపథ్యంలో వడ్డీరేట్లను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కూడా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ(Ministry of Finance) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజనపై 8.2 శాతం, మూడేళ్ళ టర్మ్ డిపాజిట్ పై 7.1 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకానికి 7.1 శాతం, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ పై 4 శాతం వడ్డీ లభిస్తుందని నోటిఫికేషన్ లో తెలిపింది. కిసాన్ వికాస్ పత్ర పథకంపై(115 నెల టెన్యూర్)పై 7.5 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పై 7.7 శాతం వడ్డీ ఇస్తామంది.