EPFO: పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ శుభవార్త.. ఎక్కడ ఉన్నా పెన్షన్ పొందే సౌకర్యం

సీపీపీఎస్ వల్ల ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్‌కు నుంచైనా తమ పెన్షన్‌ను సజావుగా తీసుకోవచ్చు.

Update: 2025-01-03 14:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఈపీఎస్ పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ శుభవార్తం అందించింది. దేశంలో ఎక్కడ ఉన్నా, ఏ బ్యాంకు ద్వారా అయినా పెన్షన్ తీసుకునే విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్టు శుక్రవారం ప్రకటించింది. ఇటీవల ప్రవేశపెట్టిన సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్(సీపీపీఎస్) ద్వారా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ కార్యాలయాల నుంచి సుమారు రూ. 1,570 కోట్లను పంపిణీ చేసినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా దేశంలోని 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదివరకు ఉన్న పెన్షన్ పంపిణీ విధానంలో ఈపీఈఫ్ఓ జోనల్, ప్రాంతీయ కార్యాలయాలు మూడు నాలుగు బ్యాంకులతో మాత్రమే భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. దీనివల్ల పెన్షనర్లు ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకుకే వెళ్లాల్సి వచ్చేది. తాజాగా అమల్లోకి వచ్చిన సీపీపీఎస్ వల్ల ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్‌కు నుంచైనా తమ పెన్షన్‌ను సజావుగా తీసుకోవచ్చు. పెన్షన్ విడుదలైన వెంటనే బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. ఈ విధానం వల్ల పెన్షనర్లు నేరుగా ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లే పని ఉండదు. ఏ ప్రాంతంలో వెళ్లినా ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పెన్షన్ ఆర్డర్ బదిలీ చేసే అవసరంలేదు. బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చు. గతేడాది అక్టోబర్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొచ్చిన ఈ విధానాన్ని 2025, జనవరి 1 నుంచి పూర్తిగా స్థాయిలో అమలు చేశారు. 

Tags:    

Similar News