హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్.. భారీగా పెంచిన రుణ రేట్లు

గృహ, వాహన, వ్యక్తిగత ఇతర అంశాలపై బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంటారు.

Update: 2023-05-08 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: గృహ, వాహన, వ్యక్తిగత ఇతర అంశాలపై బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంటారు. అతి తక్కువ వడ్డీ పడుతుందనే నెపంలో బ్యాంకులు నుంచి రుణాలు తీసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తారు. అయితే ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. రుణ రేట్లను పెంచుతున్నట్లు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్లు పెంచేసింది.

దీని కారణంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణ గ్రహితలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. అన్ని కాల పరిమితులకు సవరించిన వడ్డీరేట్లు వర్తిస్తాయి. పెంపు అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్ఆర్ (MCLR)లు ఇప్పుడు 7.5% - 8.05% మధ్య ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 7.85%గా ఉంది. కాగా.. పెరిగిన రుణ రేట్లు మే-8 అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి

Also Read..

151 శాతం పెరిగిన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు! 

Tags:    

Similar News