Stock Market: స్థిరమైన ర్యాలీతో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అంతకుముందు సెషన్‌లో భారీ లాభాలను చూసిన సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో స్థిరంగా లాభాలను కొనసాగించాయి.

Update: 2024-08-21 12:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు కొనసాగాయి. అంతకుముందు సెషన్‌లో భారీ లాభాలను చూసిన సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో స్థిరంగా లాభాలను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ ఈక్విటీల్లో విదేశీ నిధులు కొనసాగడం, కీలక ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్లు ర్యాలీకి దోహదపడ్డాయి. కీలక బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు, ఆసియా మార్కెట్లలో బలహీన ధోరణి కారణంగా కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో తిరిగి పుంజుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 102.44 పాయింట్లు లాభపడి 80,905 వద్ద, నిఫ్టీ 71.35 పాయింట్లు పెరిగి 24,770 వద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలను సాధించాయి. ఆల్ట్రా సిమెంట్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.90 వద్ద ఉంది. 

Tags:    

Similar News