షాకింగ్ న్యూస్: WhatsApp వాడని టైంలో మైక్రోఫోన్ పనిచేస్తుందంటూ సంచలన ఆరోపణలు

ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తున్న వాట్సాప్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ యాప్ వాడని టైంలో బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్ పనిచేస్తుందంటూ ట్విట్టర్‌ ఉద్యోగి ఒకరు ట్విట్ చేశారు.

Update: 2023-05-10 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తున్న వాట్సాప్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ యాప్ వాడని టైంలో బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్ పనిచేస్తుందంటూ ట్విట్టర్‌ ఉద్యోగి ఒకరు ట్విట్ చేశారు. దీంతో ఇది కాస్త తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఉద్యోగి స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేయగా, ఇప్పుడు అది వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్.. ఈ యాప్ నమ్మదగినది కాదంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఇష్యూ మరింత పెద్దది అయింది.

ట్విట్టర్‌లో పనిచేస్తున్న ఫోడ్ డబ్రి అనే ఒక ఇంజినీర్ పోస్ట్ చేసిన ట్విట్‌తో ఈ వ్యవహరం అంతా బయటకివచ్చింది. అతను పేర్కొన్న దాని ప్రకారం, అతన నిద్రిస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వాట్సాప్ మైక్రోఫోన్ పనిచేస్తుందని, ఉదయం లేవగానే ఫోన్‌ను చూడటంతో ఈ విషయాన్ని గమనించినట్లు తెలిపాడు. దీనికి సంబంధించి స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు.

ఈ విషయంపై భారత ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. వినియోగదారుల గోప్యత కు సంబంధించిన ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. అలాగే, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు కూడా సిద్ధమవుతుందని ఆయన తెలిపారు.

వాట్సాప్ యాజమాన్యం తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది. మైక్రోఫోన్ గురించి జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆండ్రాయిడ్‌లో ఉన్న బగ్ కారణంగా డ్యాష్‌బోర్డులో తప్పుడు సమాచారం చూపిస్తుందని పేర్కొంది. ఫిర్యాదు చేసిన వారు గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడుతున్నారని, దీనిపై విచారణ జరపాలని గూగుల్‌ను కోరినట్లు పేర్కొంది. అలాగే, యూజర్లు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, వీడియో రికార్డింగ్ చేసినప్పుడే మైక్రోఫోన్ పనిచేస్తుందని, ఈ సంభాషణలు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతాయని వాట్సాప్ వివరణ ఇచ్చింది.

Tags:    

Similar News