విజయ్ మాల్యా పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!
భారత బ్యాంకులను వేలాది కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది.
న్యూఢిల్లీ: భారత బ్యాంకులను వేలాది కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించి, తన ఆస్తులను జప్తు చేయాలంటూ ముంబై కోర్టులో జరుగుతున్న విచారణను సవాలు చేస్తూ విజయ్ మాల్యా వేసిన పిటిషన్‌ను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో పిటిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు అందడం లేదని మాల్యా తరపు న్యాయవాది సమర్పించడంతో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.
2016, మార్చిలో యూకేకు పారిపోయిన విజయ్ మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరున వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న రూ. 9,000 కోట్లను ఎగవేశాడు. దీనిపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేయగా, 2019లో ముంబై ప్రత్యేక కోర్టు పరారీ దారు గా ప్రకటించింది.