Investments: పెట్టుబడి రూ.85.. రిటర్న్స్ రూ.1,00,000. ఈ SBI స్కీమ్ సూపరో సూపరూ

Investments: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అద్బుతమైన స్కీములను ప్రవేశపెడుతోంది.

Update: 2025-03-21 08:48 GMT
Investments: పెట్టుబడి రూ.85.. రిటర్న్స్ రూ.1,00,000. ఈ SBI స్కీమ్ సూపరో సూపరూ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: Investments: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అద్బుతమైన స్కీములను ప్రవేశపెడుతోంది. ఈ స్కీములు సామాన్యులకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒకటి హర్ ఘర్ లఖ్ పతి అనే స్కీము ఉంది. ఈ వినూత్న రికవరింగ్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే మీరు లక్షలు సంపాదించవచ్చు. నిర్థిష్టకాలానికి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ పీరియడ్ ద్వారా నెలలవారీ రూ. 1లక్ష వరకు వస్తుంది. అందుకే దీనికి హర్ ఘర్ లఖ్ పతి అని పేరు పెట్టారు. ఈ స్కీము కింద 3, 4 ఏళ్ల కాలవ్యవధికి గరిష్టంగా 6.75శాతం వడ్డీరేటును అందిస్తుంది. ఇతర కాలవ్యవధికి వడ్డీరేటు 6.50శాతం ఉంటుంది.

రికరింగ్ డిపాజిట్లు అంటే ఎవరైన వ్యక్తి తాను డబ్బును ఆదా చేస్తూనే క్రమం తప్పకుండా వడ్డీ సంపాదించవచ్చు. మీరు రికరింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు నెలలవారీ ఫిక్స్ డ్ డిపాజిట్, కాలపరిమితి ముందుగానే నిర్ణయించుకోవాలి. మీరు ప్రతినెలా డిపాజిట్ చేసే స్థిర మొత్తానికి త్రైమాసికానికి వడ్డీని సంపాదిస్తుంది.

ఈ స్కీములో లక్ష రూపాయలు అందుకోవాలంటే రోజుకు రూ. 85 జమ చేయాలి. అంటే నెలకు రూ. 2500 జమ అవుతుంది. ఈ పొదుపు పై 6.75వడ్డీ వస్తుంది. అదే విధంగా 3ఏళ్లటెన్యూర్ ఎంచుకున్నట్లయితే మెచ్యూరిటీ నాటికి లక్ష అందుకోవచ్చు. 4ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 1810 చెల్లించాల్సి వస్తుంది. ఐదేళ్ల కాలానికి అయితే రూ. 1407 చెల్లించాలి. సీనియర్ సిటిజన్ రూ. 1లక్ష పొందడానికి ప్రతినెలా రూ. 2,480 చొప్పున మూడేళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు.

ఇందులో 7.25శాతం వడ్డీ రేటు లభిస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ సమయానికి ఆ వ్యక్తి రూ. 1లక్ష పొందవచ్చు. అదే నాలుగేళ్లపాటు ప్రతినెలా రూ. 1,791 చొప్పున 7.25శాతం వడ్డీరేటుతో పెట్టుబడి పెడితే గడువు ముగిసే సమయానికి లక్ష పొందవచ్చు. ఇక ప్రతి నెలా రూ. 1,389 చొప్పున 7శాతం వడ్డీరేటుతో పెట్టుబడి పెడితే గడువు ముగిసే సమాయానికి లక్ష పొందవచ్చు. చిన్న మొత్తంలో పొదుపు చేయాలనుకునేవారు ఎస్బిఐ అందించే ఈ హర్ ఘర్ లఖ్ పతి స్కీములో వెంటనే అకౌంట్ తీసుకోండి.

Tags:    

Similar News