SBI Card : రిలయన్స్, SBI సంయుక్తంగా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు!

రిలయన్స్ సంస్థ కొత్తగా క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెట్టింది.

Update: 2023-10-31 14:54 GMT

ముంబై: రిలయన్స్ సంస్థ కొత్తగా క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెట్టింది. మంగళవారం ఎస్‌బీఐ కార్డు భాగస్వామ్యంతో రిలయన్స్ రిటైల్ కో-బ్రాండెడ్ 'రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్'ని ప్రారంభించింది. ఈ కొత్త రకం లైఫ్‌స్టైల్ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు భిన్నమైన షాపింగ్ రివార్డులను పొందుతారని ఇరు సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి.

ఈ క్రెడిట్ కార్డు రిలయన్స్ రిటైల్ ఆధ్వర్యంలోని ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ నుంచి కిరాణా, ఎలక్ట్రానిక్స్ నుంచి ఫార్మా వరకు, ఫర్నిచర్ నుంచి ఆభరణాల వరకు మరెన్నో కొనుగోళ్లు, లావాదేవీలపై రివార్డులు, ప్రయోజనాలు లభిస్తాయి. ఇరు సంస్థలు రిలయన్స్ ఎస్‌బీఐ ప్రైమ్, రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ అనే రెండు రకాల కార్డులను ప్రారంభించాయి.

రిలయన్స్ ఎస్‌బీఐ కార్డు ప్రైమ్‌కు రెన్యూవల్ ఫీజు రూ. 2,999తో పాటు పన్నులు ఉంటాయి. అయితే, ఈ కార్డుపై ఏడాదికి రూ. 3 లక్షలు ఖర్చు చేసిన వారికి వార్షిక ఫీజు మినహాయింపు లభిస్తుంది. రిలయన్స్ ఎస్‌బీఐ కార్డుకు రూ. 499తో పాటు పన్నులు ఉంటాయి. ఈ కార్డుపై ఏడాదిలో రూ. లక్ష ఖర్చుకు వార్షిక మినహాయింపు పొందవచ్చు.

Read More..

బ్యాంకు ఖతాదారులకు BIG అలర్ట్.. నవంబర్‌ నెలలో భారీగా సెలవులు!  

Tags:    

Similar News