Renewable Energy: పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా

బడ్జెట్‌లో రూ. 20,000 కోట్లకు పైగా నిధులతో రెట్టింపు కేటాయింపు ప్రకటించడం ద్వారా ఇది స్పష్టమవుతోందని రాజ్యసభలో తెలిపారు

Update: 2024-08-06 18:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశాల్లో పునరుత్పాదక ఇంధనం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 20,000 కోట్లకు పైగా నిధులతో రెట్టింపు కేటాయింపు ప్రకటించడం ద్వారా ఇది స్పష్టమవుతోందని ఆయన మంగళవారం రాజ్యసభలో తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యాన్ని చేరేందుకు రూ. 30 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దేశ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించి గణనీయమైన పురోగతి జరిగింది. గత పదేళ్లలో సుమారు రూ. 7 లక్షల కోట్లు ఇప్పటికే వచ్చాయి. కాబట్టి అనుకున్న లక్ష్యం చేరేందుకు రూ. 30 లక్షల కోట్ల వరకు కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు. అంతేకాకుండా పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్), సోలార్ మాడ్యూల్స్ కోసం పీఎల్ఐ వంటి పథకాలకు కూడా ఆర్డర్లు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.  

Tags:    

Similar News