సరికొత్త 'రేంజ్ రోవర్ ఎవోక్' మోడల్‌ను విడుదల చేసిన జేఎల్ఆర్
అప్‌డేటెడ్ ఎస్‌యూవీ మోడల్ కారు డిజైన్‌తో పాటు రెండు ఇంజిన్ ఆప్షన్స్, కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
దిశ, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన కొత్త 'రేంజ్ రోవర్ ఎవోక్' మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 67.9 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అప్‌డేటెడ్ ఎస్‌యూవీ మోడల్ కారు డిజైన్‌తో పాటు రెండు ఇంజిన్ ఆప్షన్స్, కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. డిజైన్ పరంగా ఎవోక్-2024 ప్రత్యేకంగా ఫ్లోటింగ్ రూఫ్, సరికొత్త డిజైన్ ఫ్రంట్ గ్రిల్, సిగ్నేచర్ డీఆర్ఎల్ఎస్‌తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులతో వస్తుంది. అలాగే, లేటెస్ట్ జనరేషన్ ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ టెక్నాలజీతో వస్తుండగా, లేటెస్ట్ 11.4-అంగుళాల కర్వ్డ్ గ్లాస్ టచ్‌స్క్రీన్ కలిగి ఉంటుంది. వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్టు చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. స్టీరింగ్ వీల్‌పై మూన్‌లైట్ క్రోమ్, సెంటర్ కన్సోల్ ట్రిమ్, ఎయిర్ వెంట్ వంటి కొత్త ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ వెల్లడించింది. తక్కువ ఇంటీరియర్, సౌకర్యవంతమైన క్యాబిన్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ల సరికొత్త డిజైన్‌తో కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ కస్టమర్లకు మెరుగైన రైడింగ్ అనుభూతిని ఇస్తుందని జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ పేర్కొన్నారు.