Post Office Scheme: పోస్ట్ ఆఫీస్.. సరికొత్త 'బెస్ట్ స్కీం' ఇదే!
సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టడం కోసం పబ్లిక్ నిరంతరం ప్లాన్ చేస్తూనే ఉంటారు.
దిశ, వెబ్ డెస్క్: సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టడం కోసం పబ్లిక్ నిరంతరం ప్లాన్ చేస్తూనే ఉంటారు. దీర్ఘ కాలికంగా ఎక్కువ డబ్బును ఆదా చేసుకోవచ్చనే ఉద్దేశంతో వారు బెస్ట్ స్కీమ్స్ కోసం చూస్తూ ఉంటారు. అలాంటి ఒక బెస్ట్ స్కీం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ బెస్ట్ స్కీం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉంది. ఈ పథకం పేరు కిసాన్ వికాస్ పత్ర(KVP). ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా 7.5 శాతం వార్షిక వడ్డీని అందజేస్తున్నారు. ఇది భారత ప్రభుత్వంచే నిర్వహించబడే పెట్టుబడి పథకం. ఈ పథకం కింద వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన సవరించబడుతుంది. దీంట్లో మీరు నిర్ణీత వ్యవధిలో మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. అయితే ఈ పథకానికి సంబంధించి స్థానిక పోస్ట్ ఆఫీస్ లో లేదా బ్యాంక్ ల ద్వారా పెట్టుబడిని పెట్టవచ్చు. ఇది ప్రభుత్వ పథకం కావడం వల్ల మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. మీరు ఈ పథకంలో నిశ్చింతగా పెట్టుబడి పెట్టవచ్చు.
పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర (కెవిపి) యోజనలో రూ. 1000 నుంచి పెట్టుబడి ప్రారంభమవుతుంది. ఈ పథకంలో ఏడాదికి 7.5 శాతం చొప్పున రాబడి లభిస్తుంది. అయితే గత సంవత్సరం ఏప్రిల్ 2023 లో దాని వడ్డీ రేట్లు 7.2 శాతానికి పెంచారు. ఇంతకుముందు ఈ పథకంలో డబ్బు రెట్టింపు అవ్వడానికి 120 నెలలు పట్టేది. కానీ ప్రస్తుతం కేవలం 115 నెలల్లోనే అంటే 9 సంవత్సరాల 7 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. అంటే మీరు ఒకేసారి రూ.6 లక్షలుపెట్టుబడి పెడితే ఈ కాలంలో ఈ మొత్తం రూ. 12 లక్షలు అవుతుంది. పోస్టాఫీస్ లో ఈ పథకం కింద ముగ్గురు వ్యక్తులు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. అయితే ఈ పథకం కింద మీరు నామినీని జోడించడం తప్పనిసరి.