Samsung: 31వ రోజుకు చేరిన శాంసంగ్ కార్మికుల నిరసన

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సౌందరరాజన్, సీఐటీయూ యూనియన్ నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు

Update: 2024-10-09 17:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: తమిళనాడులోని శ్రీపెరంబదూర్ ప్లాంటులో శాంసంగ్ ఉద్యోగుల నిరసన తీవ్రమవుతోంది. బుధవారం సీఐటీయూ అనుబంధంగా ఉన్న శాంసంగ్ కార్మికుల నిరసన 31వ రోజుకు చేరుకోవడంతో నిరసన స్థలం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలన్న ఆదేశాలను వ్యతిరేకించిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకోవలసి వచ్చింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సౌందరరాజన్, సీఐటీయూ యూనియన్ నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం తమిళనాడు యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సౌందరరాజన్, సీఐటీయూ యూనియన్ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎ.సౌందరరాజన్‌ మాట్లాడుతూ.. 'గత 30 రోజులుగా, తాము ఏ రాజకీయ పార్టీని కలుపుకోలేదు. ఇప్పుడు వారు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కొద్దిరోజుల్లో ఈ నిరసన రాజకీయ కోణంగా మారుతుంది. పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని' ఆయన మీడియాకు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం నిరసన తెలిపిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఇతర ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరింది.

నిరసనను పరిష్కరించేందుకు తమ ఉద్యోగులతో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సోమవారం సామ్‌సంగ్ ప్రకటించింది. అయితే సమ్మెలో పాల్గొనని కార్మికులతో శాంసంగ్ యాజమాన్యం మెమోరాండంపై సంతకం చేసిందని సీఐటీయూ నేతలు ఆరోపించారు. కొత్తగా ఏర్పాటైన యూనియన్‌ శాంసంగ్‌ ఇండియా వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌ఐడబ్ల్యూయూ)కు తమ కీలక డిమాండ్‌ అంగీకరించనందున సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ నేతలు స్పష్టం చేశారు. కాగా, యూనియన్‌‎గా గుర్తించడం, వేతన సవరణతో పాటు 8 గంటల పని, ఇతర ప్రయోజనాలను కోరుతూ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  

Tags:    

Similar News