పేటీఎం షేర్లు ఢమాల్.. 30 కోట్ల మంది యూజర్లకు బిగ్ షాక్

దేశ వ్యాప్తంగా ఉన్న 30 కోట్ల పేటీఎం యూజర్లకు షాక్ తగిలింది.

Update: 2024-02-02 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: డిజిటిల్ పేమెంట్స్ ఫర్మ్ పేటీఎం మార్కెట్ వ్యాల్యూలోని ఐదో వంతు భాగాన్ని శుక్రవారం కోల్పోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వ్యాపారాన్ని నిలిపివేయాలని దాని అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఆదేశించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న 30 కోట్ల పేటీఎం యూజర్లకు షాక్ తగిలింది. పేటీఎం షేర్ రెండు రోజుల్లో 40 శాతం పతనం కాగా రూ.9,600 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు పెట్టి.. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలపై నిషేధం విధించింది. ఫాస్టాగ్ అకౌంట్లలో కూడా డిపాజిట్లు, టాప్అప్‌కు కూడా బ్రేక్ పడింది. అయితే పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వినియోగదారులకు భరోసా ఇస్తున్నారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం యాప్ పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.Paytm shares crash

Tags:    

Similar News