ఆన్‌లైన్ గేమింగ్ జీఎస్టీ పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్న పరిశ్రమలు
ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్టీ పెంపును పరిశ్రమ సానుకూలంగా స్పందించింది.
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్టీ పెంపును పరిశ్రమ సానుకూలంగా స్పందించింది. అయితే, గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై మాత్రమే జీఎస్టీ పెంచాలని, కాంటెస్ట్ ఎంట్రీ అమౌంట్‌పై ఉండకూడదని గేమింగ్ పరిశ్రమ అభిప్రాయపడింది. కాంటెస్ట్ ఎంట్రీ అమౌంట్‌పై జీఎస్టీ వల్ల దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన పరిశ్రమపై ప్రభావం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
నైపుణ్యానికి సంబంధించిన ఆట, డబ్బులు ఆర్జించే ఆట అని ఆన్‌లైన్ గేమింగ్‌లోని వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. జీజీఆర్ అనేది ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లోని గేమ్‌లో పాల్గొనేందుకు సర్వీస్ ఛార్జీలుగా వసూలు చేసే రుసుము. కాంటెస్ట్ ఎంట్రీ అమౌంట్ అనేది ప్లాట్‌ఫామ్‌లోని పోటీలో పాల్గొనేందుకు గేమర్లు డిపాజిట్ చేసే మొత్తం. కాంటెస్ట్ ఎంట్రీ ఫీజుపై కాకుండా జీజీఆర్‌పైజీఎస్టీ పెంపు ఉండేలా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని గేమ్స్ 24x7 కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ త్రివిక్రమన్ అన్నారు.
కాంటెస్ట్ ఎంట్రీ ఫీజుపై జీఎస్టీ విధించడం వల్ల పెరిగే పన్ను భారాన్ని వినియోగదారులపై మోయాల్సి ఉంటుంది. ఇది పరిశ్రమ మొత్తం వృద్ధికి విఘాతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం, వినియోగదారులు, ఈ రంగంలోని వ్యాపారాలకు నష్టాన్ని కలిగిస్తుందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: