భారీ తగ్గింపుతో OLA కొత్త బైక్ లాంచ్.. కేవలం రూ. 999తో బుకింగ్
ఓలా కంపెనీ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తన దూకుడును ప్రదర్శిస్తుంది..Latest Telugu News
బెంగళూరు: ఓలా కంపెనీ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తన దూకుడును ప్రదర్శిస్తుంది. కంపెనీ కొత్తగా మార్కెట్లోకి 'Ola S1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది కంపెనీ మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ. 85,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలనుకునే వారు రూ. 999 చెల్లించాలి.
దీపావళి పండగ సందర్బంగా కంపెనీ ఈ బైక్‌ను తక్కువ ధరకు అందిస్తుంది. అక్టోబర్ 24 వరకు ఈ బైక్ రూ. 79,999 తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటుంది. స్కూటర్ డెలివరీలు ఏప్రిల్, 2023 మొదటి వారంలో ప్రారంభమవుతాయి.
Ola S1 ఎయిర్ 2.5KWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది. ఇది ఒక్కఛార్జ్‌పై 101కి.మీ దురాన్ని అందిస్తుంది. 4.3 సెకన్లలో 0 నుండి 40 km వరకు వేగాన్ని అందుకోగలదని, అలాగే దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ అని కంపెనీ పేర్కొంది.
దీనిలో ప్రత్యేకంగా 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఓలా కంపెనీ ప్రస్తుతం దేశంలో ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుంది.
ఇవి కూడా చదవండి :