దిగ్గజ కంపెనీల బాటలోనే మెక్‌డొనాల్డ్స్.. ఉద్యోగులకు షాక్!

మాంద్యం ఆందోళనల మధ్య ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2023-04-03 11:15 GMT

వాషింగ్టన్: మాంద్యం ఆందోళనల మధ్య ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ కూడా చేరనున్నట్టు తెలుస్తోంది. కంపెనీ అమెరికాలోని ఈ వారం మెక్‌డొనాల్డ్స్ ఆఫీసులను తాత్కాలికంగా మూసేసింది. కంపెనీ పునర్నిర్మాణం కోసం కార్పొరేట్ విభాగంలో ఉద్యోగులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ​వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం పేర్కొంది.

గత వారం ఉద్యోగులకు కంపెనీ ఈ-మెయిల్ ద్వారా లేఆఫ్స్​కు సంబంధించిన విషయాన్ని సూచనప్రాయంగా తెలియజేసిందని సమాచారం. అంతేకాకుండా ఈ వారంలో 3-6 తేదీల మధ్య కార్పొరేట్ విభాగంలోని ఉద్యోగులను​ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. అదేవిధంగా షెడ్యూల్డ్ మీటింగ్స్ మొత్తం రద్దు చేసుకోవాలని కోరింది. త్వరలో ఉద్యోగుల విధులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కాబట్టి భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ఉండొచ్చని వాల్‌స్ట్రీట్ జర్నల్ అభిప్రాయపడింది. కాగా, ప్రస్తుతానికి మెక్‌డొనాల్డ్‌లో మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగులున్నారు.

Also Read..

సామాన్యులకు కేంద్రం ఊరట.. ఔషధాల ధరలు తగ్గింపు!

Tags:    

Similar News