Gautham Adani: మహారాష్ట్రలో మ‌హాయుతి కూట‌మి విజ‌యం.. అదానీకి బిగ్ రిలీఫ్..!

అదానీ గ్రూప్(Adani Group) ఛైర్మన్ గౌత‌మ్ అదానీ(Gautham Adani)పై అమెరికా(USA)లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

Update: 2024-11-23 17:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్(Adani Group) ఛైర్మన్ గౌత‌మ్ అదానీ(Gautham Adani)పై అమెరికా(USA)లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను పొందేందుకు రూ. 2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC) అదానీకి సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అదానీకి మహారాష్ట్ర(MH) అసెంబ్లీ ఎన్నికల్లో మ‌హాయుతి కూట‌మి(Mahayuti Alliance) విజ‌యం ఊరటనిచ్చే విషయం అనే చెప్పాలి. దీంతో ఆయ‌న త‌ల‌పెట్టిన 3 బిలియ‌న్ డాల‌ర్ల‌ ధారావీ అభివృద్ధి ప్రాజెక్టు(Dharavi Development Project)కు మ‌రో ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

కాగా ముంబై(Mumbai)లోని అతిపెద్ద మురికివాడగా పేరు పొందిన ధారావీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టును 2022లో అదానీ దక్కించుకున్నారు. ఇందులో భాగంగా ఒక్కో ఫ్యామిలీకి 350 చదరపు అడుగుల ఫ్లాట్స్(Flats)ను ఉచితంగా కట్టివ్వాలి. దీని కోసం 256 ఎకరాల ల్యాండ్(Land)ను మహారాష్ట్ర ప్రభుత్వం అదానీకి అప్పగించింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తామని మహా వికాస్ అఘాడీ కూటమి(MVA Alliance) హామీ ఇచ్చింది. కానీ ఓటర్లు మ‌హాయుతి కూటమికి పట్టం కట్టడంతో అదానీకి అడ్డంకులు తొల‌గిన‌ట్టే అని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News