Online Motor Insurance: ఆన్‌లైన్ మోటార్ బీమాలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ హవా..!

భారతదేశం(India)లో ఇటీవల కాలంలో కార్ల వినియోగం(Cars Usage) గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-11-23 16:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో ఇటీవల కాలంలో కార్ల వినియోగం(Cars Usage) గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. చాలా కంపనీలు తక్కువ ధరకే కార్లను కొనుగోలుకు అందుబాటులోకి తేవడంతో మధ్యతరగతి ప్రజలు(Middle class people) కూడా వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కార్లకు తప్పని సరిగా బీమా(Insurance) ఉండాలి. కారు ప్రమాదానికి(Accident) గురైనప్పుడు లేదా ఏదైనా డ్యామేజ్(Damage) అయినప్పుడు ఈ బీమా ఆర్ధిక రక్షణ(Financial protection)ను అందిస్తుంది. కాగా బీమాను ఆన్‌లైన్(Online) లేదా ఆఫ్ లైన్(offline)లో కూడా తీసుకోవచ్చు. టెక్నాలజీ(Technology) అందుబాటులోకి వచ్చిన తర్వాత మోటార్ బీమా రంగంలో ఆన్‌లైన్ కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే.. ఆన్‌లైన్ మోటార్ ఇన్సూరెన్స్ లో మారుతీ సుజుకీ(Maruti Suzuki), హ్యుందాయ్ మోటార్(Hyundai Motor) సంస్థలు దూసుకెళ్తున్నాయని పాలసీబజార్(Policybazaar) నివేదిక తాజాగా వెల్లడించింది. వాగన్ఆర్(5.9శాతం), స్విఫ్ట్(5.9), ఐ20(4.4), బాలేనో(4.3), ఆల్టో(4.2శాతం) మార్కెట్లో మంచి వాటా దక్కించుకున్నాయని పేర్కొంది. ఇక విద్యుత్ వాహనాల(EV) ఆన్‌లైన్ ఇన్సూరెన్స్‌లో 2022లో 423శాతం, గత ఏడాది 399శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. అలాగే ఆన్‌లైన్ మోటార్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారుల్లో 25 నుంచి 40 ఏళ్ల మధ్యవారే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొంది. ఇక ఆన్‌లైన్ మోటార్ ఇన్సూరెన్స్ ఎక్కువ విక్రయాలు జరుపుతున్న నగరాల్లో 8.1 శాతం వాటాతో ఢిల్లీ(Delhi) మొదటి స్థానంలో ఉండగా.. బెంగళూరు(Bangalore) 4.4%, ముంబై(Mumbai) 2.1%, పుణె(Pune) 1.9% వాటతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags:    

Similar News