Maruti Suzuki Q2 Results: రెండో త్రైమాసికంలో తగ్గిన మారుతీ సుజుకీ లాభాలు
భారతదేశం(India)లోని ప్రముఖ సంస్థలు గత కొన్ని రోజులుగా సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసిక ఫలితాల(Quarter Results)ను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని ప్రముఖ సంస్థలు గత కొన్ని రోజులుగా సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసిక ఫలితాల(Quarter Results)ను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ(Maruti Suzuki) త్రైమాసిక ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ రూ. 3,102 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు తెలిపింది. కాగా గతేడాది ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం రూ. 3786 కోట్లుగా ఉందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ.37,339 కోట్ల నుంచి రూ.37,449 కోట్లకు చేరింది. అలాగే ఈ త్రైమాసికంలో మొత్తం 5,41,550 కార్లు సేల్ అయ్యాయి. ఇందులో దేశీయంగా 4,63,834 యూనిట్లు అమ్ముడుపోగా, 77,716 కార్లు ఎగుమతి అయ్యాయి. కాగా త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి మారుతీ సుజుకీ షేరు ధర 2.62 శాతం మేర తగ్గి రూ.11,184 వద్ద ముగిసింది.