LIC: ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం జగన్నాథ్!
మార్కెటింగ్‌లో బాగా అనుభవం ఉన్న జగన్నాథ్ 1988లో ఎల్ఐసీలో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా చేరారు.
ముంబై: ప్రభుత్వ రంగ అతిపెద్ద బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మంగళవారం సంస్థ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం జగన్నాథ్‌ను నియమించింది. ఆయన మార్చి 13 నుంచే బాధ్యతలు స్వీకరించారు. మార్కెటింగ్‌లో బాగా అనుభవం ఉన్న జగన్నాథ్ 1988లో ఎల్ఐసీలో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా చేరారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఎం జగన్నాథ్ ఎల్ఐసీ ఎండీగా పదవీ విరమణ చేసేవరకు లేదా తదుపరి ఆర్డర్ ఏది ముందు ఉంటే అది అమలయ్యే వరకు కొనసాగుతారని ఎల్ఐసీ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కామర్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన జగన్నాథ్ సీఏ చేశారు. మార్కెటింగ్‌లో పీజీ డిప్లోమా, లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఇంటర్నేషనల్ పీజీ డిప్లోమా చేశారు. ఇదివరకు ఆయన ఎల్ఐసీ వివ్ధ డివిజన్‌లలో సీనియర్ డివిజనల్ మేనేజర్‌గా పనిచేశారు. 2009-2013 మధ్య శ్రీలంకలోని కొలంబో ఎల్ఐసీ సీఈఓ, ఎండీగా కూడా నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా ఆయన గతంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకాలను కలుపుకుని సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ జోనల్ మేనేజర్‌గా కూడా ఉన్నారు. కాగా, సోమవారం ఎల్ఐసీ ఛైర్మన్‌గా ఎంఆర్ కుమార్ పదవీకాలం పూర్తవడంతో మంగళవారం నుంచి మూడు నెలల పాటు ఎల్ఐసీ తాత్కాలిక ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
Also Read..