Life Insurance: జీవిత బీమా చేసే వారికి అలెర్ట్.. ఇలా చేయవద్దు.. జాగ్రత్తగా ఉండాల్సిందే!

Life Insurance: జీవిత బీమా అనేది కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేంది.

Update: 2025-03-20 11:56 GMT
Life Insurance: జీవిత బీమా చేసే వారికి అలెర్ట్.. ఇలా చేయవద్దు.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : Life Insurance: జీవిత బీమా అనేది కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేంది. మరో విధంగా చెప్పాలంటే ఇది ఒక పొదుపు సూత్రం. చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నా..వారికి సరైన సలహా, సూచలు ఇచ్చేవాళ్లు ఉండరు. అలాంటి వారికోసమే ఈ స్టోరీ.

1. ప్రతి ఒక్కరికీ వారి వారి హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ ఉంటుంది. దాన్ని లెక్కల ద్వారా తెలుసుకోవచ్చు. మీ హెచ్ఎల్ వి ఎంత ఉందో తెలుసుకుని..దానికి తగ్గట్లుగా జీవిత బీమాను తీసుకోండి.

2. మీరు జీవితంలో ఏ దశలో ఉన్నారో ఒకసారి చూసుకోండి. అలాగే రిస్క్ తీసుకునే మీ సామర్థ్యం, మీకున్న ఆర్థిక లక్ష్యాలు మొదలైన వాటికి తగ్గట్లుగా జీవిత బీమా పథకాలను ఎంచుకోవడం మంచిది.

3. మీ అవసరాలకు తగట్టు పాలసీ గడువు, ప్రీమియం ఎంత కట్టాలో కూడా నిర్ణయించుకోండి.

4. తక్కువ ధరకే వస్తుంది కదా అని ఏదొక ప్లాన్ తీసుకోకండి. ఎందుకంటే ఆ ప్లాన్ మీకు సరిపోకపోవచ్చు.

5. పాలసీ నిబంధనలు జాగ్రత్తగా చదవండి మర్చిపోకండి. షరతులు సరిగ్గా చూసుకోండి.

6. మంచి లాభాలు, రిస్క్ కవర్ ఇచ్చే యాడ్ ఆర్ రైడర్స్ ను కూడా కొనండి.

7. అప్లికేషన్ ఫారమ్ నింపేటప్పుడు సరైన సమాచారం ఇవ్వాలి. పూర్తి వివరాలు ఇవ్వాలి.

8. మీ పాలసీకి నామినీ పేరు రాయడం అస్సలు మర్చిపోకూడదు. నామినీకి మీ పాలసీ గురించి అన్ని వివరాలు తెలియజేయండి.

9. పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో ఈ బీమా అకౌంట్లో సేవ్ చేసుకోండి.

10. పాలసీలు 30 రోజుల ఫ్రీలుక్ ఆఫర్ తో వస్తాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకోండి.

Tags:    

Similar News