Laptops: ల్యాప్‌టాప్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు..! ఎప్పటినుంచంటే..?

ల్యాప్‌టాప్​లు(​Laptops), ట్యాబ్లెట్లు(Tablets), పర్సనల్ కంప్యూటర్ల(PC) దిగుమతిల(Imports)పై వచ్చే ఏడాది జనవరి తర్వాత కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2024-10-20 12:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ల్యాప్‌టాప్​లు(​Laptops), ట్యాబ్లెట్లు(Tablets), పర్సనల్ కంప్యూటర్ల(PC) దిగుమతిల(Imports)పై వచ్చే ఏడాది జనవరి తర్వాత కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వెల్లడించింది. కాగా డెల్, ఏసర్, ఆపిల్, లెనోవో, హెచ్ పీ(Dell, Acer, Apple, Lenovo, HP) వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇండియాలో ల్యాప్‌టాప్​లను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. అయితే ఇవన్నీ చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని సేల్ చేస్తున్నాయి. అయితే దిగుమతులపై ఆంక్షలు విధిస్తే ఈ కంపెనీలన్నీ భారత్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు(Manufacturing Units) పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్(Electronics Gadgets) దిగుమతులపై కేంద్రం పరిమితులు పెడితే సుమారు 84,000 కోట్లకు పైగా ఈ ఇండస్ట్రీపై ప్రభావం పడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించాలనే ప్రతిపాదన ఇంతకుముందే వచ్చింది. అయితే అమెరికా కంపెనీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆ ప్రతిపాదనను కేంద్రం విరమించుకుంది.  


Similar News