Techno Pova 5Pro 5G: టెక్నో దీపావళి ఆఫర్.. రూ.12,499కే 5జీ స్మార్ట్..ఎక్కడ కొనుగోలు చేయాలంటే..?

చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో(Techno) తక్కువ ప్రైస్(Low price)లో సూపర్ ఫీచర్లున్న మొబైల్ కొనే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-20 16:01 GMT

దిశ, వెబ్ డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో(Techno) తక్కువ ప్రైస్(Low price)లో సూపర్ ఫీచర్లున్న మొబైల్ కొనే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. టెక్నో పోవా 5ప్రో 5జీ ఫోన్(Techno Pova 5Pro 5G phone)ను రూ.12,499కే అందిస్తున్నామని పేర్కొంది. దీన్ని అమెజాన్(Amazon)లో నడుస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Great Indian Festival Sale)లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ప్రస్తుతం దీని ధర రూ.13,999గా ఉంది. అయితే ఈ సేల్ లో రూ. 1500 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ మొబైల్ ను రూ.12,499కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ పై రూ. 700 క్యాష్ బ్యాక్ కూడా ఇస్తోంది.

టెక్నో పోవా 5ప్రో 5జీ ఫోన్ ఫీచర్ల వివరాలు..

  • 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+LCD డిస్‌ప్లే
  • ఈ మొబైల్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
  • 8జీబీ ర్యామ్+256జీబీ రోమ్(8GB RAM +256GB ROM)
  • 120Hz రిఫ్రెష్ రేట్
  • ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ కలిగి ఉంది. అలాగే రెండు LED ఫ్లాష్ లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
  • 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh కెపాసిటీ బ్యాటరీని అందిస్తున్నారు. 

Similar News