పిల్లల చదువు నాశనం చేసే మొబైల్ ఫోన్ అలవాట్లు ఇవే...
మొబైల్ ఫోన్ చిన్నా పెద్ద అందరికీ జీవితంలో భాగమైపోయింది. తినకుండా అయినా ఉంటున్నారేమో కానీ ఒక్కరోజు మొబైల్ స్క్రోల్ చేయకుండా మాత్రం ఉండలేక పోతున్నారు.
దిశ, ఫీచర్స్ : మొబైల్ ఫోన్ చిన్నా పెద్ద అందరికీ జీవితంలో భాగమైపోయింది. తినకుండా అయినా ఉంటున్నారేమో కానీ ఒక్కరోజు మొబైల్ స్క్రోల్ చేయకుండా మాత్రం ఉండలేక పోతున్నారు. అయితే కొన్ని ఫోన్ తో చేసే పనులు పిల్లల చదువు నాశనం చేస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
- నోటిఫికేషన్స్ చెక్ చేస్తూ ఉండే పిల్లలు చదువు నుంచి దూరం అవుతారు. వారి ఏకాగ్రత దెబ్బతింటుంది.
- రాత్రి ఫోన్ చూసేటప్పుడు స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ రేస్ నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల పిల్లలు రిఫ్రెష్ గా, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేలా మేల్కోలేరు.
- మొబైల్ గేమ్స్ పై ఎక్కువ సమయం కేటాయించే విద్యార్థులు.. హోం వర్క్ చేయలేరు. చదవలేరు. దీంతో క్లాస్ లో వెనుకబడి పోతారు. విద్యా పనితీరు దెబ్బతింటుంది.
- సోషల్ మీడియాను అదే పనిగా చూసే విద్యార్థులు టీచర్ చెప్పిన పనులు చేయరు. పైగా వారు చూసే వీడియోలు ఆందోళన, తక్కువ ఆత్మగౌరవం భావాలను ప్రేరేపిస్తాయి.
- క్లాస్ సమయంలో ఫోన్ యూజ్ చేసే, మెసేజ్ లు పంపే పిల్లలు.. ముఖ్యమైన లెసన్స్ మిస్ అవుతారు. క్లాస్ డిస్కషన్ లో చేరడం కష్టంగా ఉంటుంది.
- మొబైల్ ను ఎక్కువ సేపు చూడటం పేలవమైన భంగిమకు దారితీస్తుంది. మెడ నొప్పి , తల నొప్పికి కారణం అవుతుంది. చిన్నారులు నేర్చుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.