Psychology : ఎదుటి వ్యక్తిలో ఈ మార్పులు కనిపిస్తే.. వారు సంతోషంగా లేరని అర్థం!

Psychology : ఎదుటి వ్యక్తిలో ఈ మార్పులు కనిపిస్తే.. వారు సంతోషంగా లేరని అర్థం!

Update: 2024-12-20 12:51 GMT

దిశ,ఫీచర్స్ : కొన్ని మాటలు.. వాటి వెనుకున్న ఆంతర్యాన్ని తేటతెల్లం చేస్తాయి. కొన్ని ప్రవర్తనలు అవతలి వ్యక్తి ఎదుర్కొంటున్న గందరగోళాన్నో, సానుకూల భావాన్నో తెలియజేస్తాయి. ఇలా ఒకటో రెండో కాదు.. జీవన పోరాటంలో ఒడిదుడుకులు ఎదుర్కొనేవారు చాలామందే ఉంటారు. కొన్నిసార్లు వాటిని అధిగమించలేకనో, అధిగమిండచంలో సమస్యలు ఎదురు కావడంవల్లో మెంటల్లీ డిస్టర్బ్ అవుతుంటారు. దీంతో కొన్ని విషయాల్లో ఆసక్తి కోల్పోతారు. సంతోషంగా, సంతృప్తిగా లేకపోయినా బయటకు చెప్పరు. వారిని అర్థం చేసుకొని ఎమోషనల్ సపోర్ట్ అందిస్తే సాధారణంగా మారుతారు. అయితే సైకాలజిస్టుల ప్రకారం.. అలాంటి వ్యక్తుల మాటలు, చేతలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ..

ఎప్పుడూ నవ్వుతూ.. సంతోషంగా కనిపించే వారందరూ నిజంగానే అలా ఉన్నారని గ్యారెంటీగా చెప్పలేం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొందరు తాము అనుభవిస్తున్న బాధలను, భావోద్వేగాలను ఎవరితోనూ వ్యక్తం చేయలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనిని కవర్ చేయడానికి హ్యాపీగా ఉన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు హైపర్ యాక్టివ్‌గా ప్రవర్తిస్తూ నిజమైన భావాలను దాచేస్తుంటారు. అలాగే ఎక్కువగా జోకులు వేయడం, ఎవరైనా జోకులు వేసినా, ఏదైనా మాట్లాడినా దానిపట్ల ఎక్కువగా రెస్పాండ్ అవ్వడం, అతి చొరవ ప్రదర్శించడం చేస్తుంటారు. కానీ వీరిని లోలోపల ఓ విధమైన అసంతృప్తి వెంటాడుతూ ఉండవచ్చు అంటున్నారు మాననిసిక నిపుణులు.

నెగెటివ్ పదాలను ఉపయోగించడం

లోలోన లోన్లీనెస్ భావాలు వెంటాడుతున్నవారు సరదాగా, నవ్వుతూ కనిపించినప్పటికీ, వీరిలో కనిపించే మరో కోణం ఆయా సందర్భాల్లో నెగెటివ్ పదాలను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. తమను తాము ప్రతికూల పదాలతో విమర్శించుకుంటారు. ‘‘నాదేముంది? నేను అలా చేసినా లాభం లేదు. ఈ జీవితం నీటిపై బుడగలాంటిది? ఏదో కొన్నాళ్ల జీవితంలో ఎలాగోలా బతికేయాలి’’ వంటి మాటలు ఉపయోగిస్తుంటారు. అయితే ఎప్పుడూ వీటిని యూజ్ చేయరు. దీంతోపాటు పలు విషయాల్లో తీవ్రమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. బాధ్యలు, సంబంధాలు, కుటుంబం వంటివి భారంగా భావిస్తారు.

హద్దు మీరిన స్వీయ విమర్శ

లైఫ్‌లో హ్యాపీగా, లోన్లీగా ఉన్నట్లు భావించే వారు తమను తాము ఎక్కువగా విమర్శించుకుంటూ ఉంటారు. తమలోని అసంతృప్తిని ఇతరులు గమనించకపోయినా, పట్టించుకోకపోయినా ఎవరేం అనుకుంటారోనని మదన పడుతుంటారు. లోలోన కుంచించుకుపోతుంటారు. సొంత ఆలోచనల్లో, నిర్ణయాల్లో తమను తాము అతిగా విమర్శించుకుంటారు.

అభిరుచులు - ఆహారం

తమ జీవితంలో సంతోషంగా లేని వ్యక్తుల్లో కనిపంచే మరో లక్షణం వీరు తమ అభిరుచులను విస్మరిస్తుంటారు. ఏదీ సాధించాలనే ఉద్దేశం లేదని చెప్తుంటారు. ఒకప్పుడు తమకు ఎంతో ఇష్టమైన విషయాలపై కూడా శ్రద్ధ, ఆసక్తి వంటివి తగ్గినట్లు చెబుతుంటారు. అలాగే ఆహారపు అలవాట్లలోనూ ఆకస్మిక మార్పులు, సరిగ్గా తినకపోవడం లేదా అతిక తినడం, అందం, ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించకపోవడం వంటివి మానసికంగా ఏవో సమస్యలు ఎదుర్కొంటున్నారనడానికి నిదర్శనం.

సెల్ఫ్‌ కేర్ ఉండదు!

జీవితంలో సంతోషంగా లేని వ్యక్తులు తమ ఆరోగ్యం, స్వీయ సంరక్షణను విస్మరిస్తుంటారు. నష్టం జరుగుతుందని తెలిసినా సరైన భోజనం, స్నాక్స్ వంటివి తీసుకోకపోవడం, పర్సనల్ హైజీన్‌ను విస్మరించడం, రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకుండా లోతైన ఆలోచనల్లో మునిగిపోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు మీ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Tags:    

Similar News