Fennel Milk : పాలల్లో సోంపు కలిపి తాగితే..?

Fennel Milk : పాలల్లో సోంపు కలిపి తాగితే..?

Update: 2024-12-20 13:19 GMT

దిశ, ఫీచర్స్ : పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని తెలుసు.. కానీ సోంపు కలిపిన మిల్క్ తాగితే ఇంకా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే సోంపులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ వంటి పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్ ఎలిమెంట్స్ సోంపు గింజల్లో అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

*పాలలో సోంపు పొడిగా చేసి కలిపి తాగడంవల్ల జీర్ణక్రియ ఆరోగ్య మెరుగు పడుతుంది. ఇందులోని పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు కడుపులో ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి సమస్యలను దూరం చేస్తాయి. అలాగే మెగ్నీషియం ఉండటంవల్ల మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. పరోక్షంగా ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఫైటో ఈస్ట్రోజెన్‌లకు మూలం కాబట్టి హార్మోన్లు అసమతుల్యతను, పీరియడ్స్‌ సమయంలో నొప్పిని తగ్గించడంలో సోంపు కలిపిన పాలు సహాయపడతాయి.

* ఎలా తయారు చేయాలి? : సోంపు పాలను తయారు చేయడం చాలా ఈజీ. ఒక గ్లాసు పాలలో ఒక చెంచా సోంపును వేసి తక్కువ మంట మీద మరిగించాలి. తర్వాత ఆ పాలన వడకట్టి చల్లారాక తేనె లేదా బెల్లం కలుపుకొని తాగవచ్చు. 

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Read More...

Aging Foods : వీటిని తినేముందు ఆలోచించండి..! ఎందుకంటే..


Tags:    

Similar News