iQ00 13: త్వరలో భారత మార్కెట్లో ఐక్యూ 13 లాంచ్.. స్పెసిఫికేషన్స్ వివరాలివే..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ, వివో(Vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ(iQ00) నుంచి కొత్త ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది.

Update: 2024-10-20 17:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ, వివో(Vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ(iQ00) నుంచి కొత్త ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది. 'ఐక్యూ 13(iQ00 13)' పేరుతో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫోన్ అక్టోబర్ చివరి వారంలో చైనా(China)లో సేల్ ప్రారంభం కానుండగా డిసెంబర్ నెలలో ఈ ఫోన్ భారత మార్కెట్(Indian Market)లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. అయితే దీని ధరను కంపెనీ అధికారంగా ప్రకటించలేదు. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్(Specifications)ను సంస్థ ఆన్‌లైన్ లో రివీల్ చేసింది.

ఐక్యూ 13(iQ00 13) ఫోన్ ఫీచర్ల వివరాలు..

  • 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుందని సమాచారం.
  • క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్ సెట్(Qualcomm Snapdragon 8 Gen 4 Chipset)తో రాబోతున్న మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ ఇది.
  • 16జీబీ ర్యామ్+256జీబీ రోమ్(16GB RA+512GB ROM)
  • 144Hz రిఫ్రెష్ రేట్(144Hz Refresh Rate)తో రాబోతుంది.
  • ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ 2ఎక్స్ టెలిఫోటో కెమెరాలతో రాబోతుంది.
  • సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
  • 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6150mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. 

Similar News