Tecno Phantom V Fold2: టెక్నో నుంచి త్వరలో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!

చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో(Techno) ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌(Foldable Smartphone)ను త్వరలో గ్లోబల్‌ మార్కెట్‌(Global Market)తో పాటు భారత్‌(India)లో కూడా విడుదల చేయనుంది.

Update: 2024-10-19 16:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో(Techno) ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌(Foldable Smartphone)ను త్వరలో గ్లోబల్‌ మార్కెట్‌(Global Market)తో పాటు భారత్‌(India)లో కూడా విడుదల చేయనుంది. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్‌2(Tecno Phantom V Fold2) పేరుతో ఈ కొత్త ఫోన్(New Phone)ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధర రూ.92,000 నుంచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్ మొత్తం మూడు కలర్‌లో లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను 128 జీబీ ర్యామ్‌, 512 జీబీ ర్యామ్‌ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

టెక్నో ఫాంటం వీ ఫోల్డ్2 5జీ ఫోన్ ఫీచర్ల వివరాలు..

  • 6.42-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+LTPO అమోలెడ్ డిస్‌ప్లే
  • మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్లస్‌ చిప్‌సెట్‌తో ఈ మొబైల్ పనిచేయనుందని తెలుస్తోంది.
  • ఇక కెమెరా విషయానికొస్తే బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ పోర్ట్రైట్ లెన్స్, 50-మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది.
  • సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఇవ్వనున్నారు.
  • 70W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌, 15వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సపోర్టుతో 5750mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది.

Similar News