E L & N London: భారత మార్కెట్లోకి ఈఎల్ అండ్ ఎన్ లండన్ ఎంట్రీ.. తొలి బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ చేసిందంటే..?

ప్రపంచ మార్కెట్(World Market)లో పేరు పొందిన ప్రముఖ కేఫ్ బ్రాండ్(Cafe Brand) ఈఎల్ అండ్ ఎన్ లండన్ (Eat, Live & Nourish London) భారతదేశం(India)లోకి ప్రవేశించింది.

Update: 2024-10-20 15:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ మార్కెట్(World Market)లో పేరు పొందిన ప్రముఖ కేఫ్ బ్రాండ్(Cafe Brand) ఈఎల్ అండ్ ఎన్ లండన్ (Eat, Live & Nourish London) భారతదేశం(India)లోకి ప్రవేశించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన జియో వరల్డ్ ప్లాజా(Jio World Plaza)లో తన మొదటి బ్రాంచ్(First Branch)ను ప్రారంభించింది. భారతీయ కుటుంబాలకు మరీ ముఖ్యంగా కాఫీ ప్రేమికుల కోసం సరికొత్త స్టైల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు ఈఎల్‌ అండ్‌ ఎన్‌ లండన్‌(EL & N London) వ్యవస్థపకులు అలెగ్జాండర్ మిల్లర్(Alexander Miller) తెలిపారు. అలాగే ఇందులో అంతర్జాతీయ రుచులతో పాటు లోకల్ రుచులను కూడా అందుబాటలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.

కాగా ఈఎల్ అండ్ ఎన్ సంస్థను అలెగ్జాండర్ మిల్లర్ 2017లో స్థాపించారు. దీన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. ఈ కేఫ్ బ్రాండ్ ఈఎల్ అండ్ ఎన్ ఫార్వర్డ్ డిజైన్, స్పెషాలిటీ కాఫీ లాంటి వాటితో పాటు స్పెషల్ ఫుడ్ కూడా అందిస్తుంది. ఈ కంపెనీకి ప్రస్తుతం ప్యారిస్(Paris), మిలన్(Milan), దుబాయ్(Dubai), కౌలలంపూర్(Kuala Lumpur)తో సహా వరల్డ్ వైడ్ గా 37 బ్రాంచులు ఉన్నాయి. తాజాగా ఇండియాలోని ముంబై(Mumbai) లో తన వ్యాపారాన్ని స్టార్ట్ చేసి కాఫీ ప్రియులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈఎల్ అండ్ ఎన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Similar News