Diwali Muhurat Trading: నవంబర్1న దీపావళి మూరత్ ట్రేడింగ్.. సెషన్ ప్రారంభ సమయం ఎప్పుడంటే..!

ప్రతి సంవత్సరం దీపావళి పండగ(Diwali festival) సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్(Indian stock market) లలో మూరత్ ట్రేడింగ్(Muhurat Trading) నిర్వహించడం ఆనవాయతీగా వస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-20 14:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సంవత్సరం దీపావళి పండగ(Diwali festival) సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్(Indian stock market) లలో మూరత్ ట్రేడింగ్(Muhurat Trading) నిర్వహించడం ఆనవాయతీగా వస్తున్న విషయం తెలిసిందే. స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి రోజు ట్రేడింగ్‌ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది చాలా మంది ఇన్వెస్టర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు(Stock Exchanges) ప్రతి సంవత్సరం దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు మాత్రమే కొనసాగుతుంది. దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమయంలో కనీసం ఒక్క స్టాక్‌ అయినా కొనాలని చాలామంది ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. కాగా మూరత్‌ ట్రేడింగ్‌ తొలిసారి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలో(BSE) 1957లో స్టార్ట్ చేశారు. తర్వాత 1992లో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(NSE) స్థాపించినప్పుడు అదే సంవత్సరం నుంచి ఈ మూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ ఏడాది మూరత్‌ ట్రేడింగ్‌ వివరాలను జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ తాజాగా వెల్లడించింది. నవంబర్1 తేదీన ఈ సెషన్ నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా మూరత్‌ ట్రేడింగ్‌ కేవలం గంట సేపు మాత్రమే జరుగుతుందని పేర్కొంది. ట్రేడింగ్‌ సమయం నవంబర్1 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై అదే రోజు సాయంత్రం 7 గంటలకు ముగుస్తుందని NSE తెలిపింది. కాగా ఇంట్రాడే పోజీషన్లు 15 నిమిషాల ముందే ముగుస్తాయనే సంగతిని ట్రేడింగ్ చేసే వాళ్లు గుర్తుంచుకోవాలి.        


Similar News