03 January 2024 : కోడిగుడ్డు ప్రియులకు భారీ షాక్.. ఇప్పుడు డజన్ గుడ్లు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
దిశ, ఫీచర్స్: తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక వస్తువుకు ధరలు తగ్గుతున్నాయనుకుంటే.. మరొక వస్తువుకు ధర పెరిగేందుకు రెడీగా ఉంటోంది. మొన్నటివరకు ఉల్లిగడ్డలు కన్నీళ్ళు తెప్పించాయి. ఆ తర్వాత టమాటలైతే చేతికి కూడా అందకుండా పోయాయి. ఇలా ధరలన్నీ కొండెక్కి సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి. తాజాగా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి.దీంతో ప్రజలు గుడ్డును కొనుగోలు చేయాలన్నా భయపడుతున్నారు. ఆ డబ్బులతో కూరగాయలు కొని ఆరగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా రూ.72 నుంచి రూ.84కు పెరిగింది. పెరిగిన ధరలను చూసి జనాలు షాక్ అవుతున్నారు. హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.76 ఉండగా.. కానీ రిటైల్ మర్కెట్లో రూ.7గా అమ్ముతున్నారు. కొన్ని దుకాణాల్లో అయితే రూ.7.50, రూ.8గా కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం ఒక కేసు గుడ్ల ధర రూ.180 నుంచి రూ.200 పలుకుతోంది.