ఈ ఏడాది ద్వితీయార్థంలో డిమాండ్ రికవరీ.. ఎఫ్ఎంసీజీ పరిశ్రమ!

న్యూఢిల్లీ: దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో ముడి పదార్థాలు, ఇతర ఇన్‌పుట్ ఖర్చుల ఒత్తిడి తగ్గుముఖం పట్టిందని కంపెనీ పేర్కొన్నాయి.

Update: 2022-08-14 15:38 GMT

న్యూఢిల్లీ: దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో ముడి పదార్థాలు, ఇతర ఇన్‌పుట్ ఖర్చుల ఒత్తిడి తగ్గుముఖం పట్టిందని కంపెనీ పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుత త్రైమాసికంలో తమ ఉత్పత్తుల ధరల పెంపు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు హెచ్‌యూఎల్, ఐటీసీ, గోద్రేజ్ కన్స్యూమర్, నెస్లె, డాబర్, బ్రిటానియా కంపెనీలు తీవ్ర మర్జిన్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమ్మకాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు తక్కువగా ఉన్నాయని కంపెనీ తెలిపాయి.

ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పరిస్థితులు మెరుగుపడవచ్చని, ఈ ఏడాది ద్వితీయార్థంలో డిమాండ్ రికవరీ చూడగలమని కంపెనీలు ఆశిస్తున్నాయి. కంపెనీలు మొదటి త్రైమాసికంలో ధరలను పెంచాయని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం దిగి వస్తున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ ధరల పెంపు, మార్జిన్‌పై ఒత్తిడి ఉందని బ్రిటానియా ఇండస్ట్రీస్ పేర్కొంది. ఒకవేళ ప్రస్తుత త్రైమాసికంలో ధరల పెరుగుదల ఉండకపోతే, మూడో త్రైమాసికంలో ప్రభావం ఉండొచ్చని డాబర్ ఇండియా సీఈఓ మోహిత్ మల్హోత్రా అన్నారు. నాలుగో త్రైమాసికంలో ధరల పెరుగుదల కొంత తగ్గుతుందని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News