పండుగ సీజన్‌లో రూ. 94 వేల కోట్లకు పైగా Online అమ్మకాలు!

దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆన్‌లైన్ అమ్మకాలు ఏకంగా రూ. 94,000 కోట్ల..Latest Telugu News

Update: 2022-09-08 10:53 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆన్‌లైన్ అమ్మకాలు ఏకంగా రూ. 94,000 కోట్ల(11.8 బిలియన్ డాలర్ల)ను చేరుకుంటాయని ఓ నివేదిక అంచనా వేసింది. ఇది గత ఏడాది పండుగ సీజన్ విక్రయాలతో పోలిస్తే 28 శాతం ఎక్కువ. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ప్రకారం, పండుగ సీజన్ మొదలైన వారంలో సుమారు రూ. 47 వేల కోట్ల విలువైన అమ్మకాలు జరగవచ్చని, ఇది గత ఏడాది జరిగిన రూ. 38.2 వేల కోట్ల కంటే 28 శాతం అధికం.

ఇదే సమయంలో, 2018 కరోనా మహమ్మారికి ముందు పండుగ సీజన్ అమ్మకాలతో పోలిస్తే ఈసారి 3 రెట్లు వృద్ధిని అంచనా వేస్తున్నట్టు రెడ్‌సీర్ పేర్కొంది. 2018 నుంచి ఆన్‌లైన్ వినియోగదారుల సంఖ్య 4 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాము. గత రెండేళ్ల వ్యవధిలోనే డిజిటల్ వాడకం అత్యంత వేగవంతంగా జరిగింది. ముఖ్యంగా టైర్2 వంటి పట్టణాల్ల్లోనూ ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో వృద్ధి గణనీయంగా ఉండనుందని రెడ్‌సీర్ అసోసియేట్ పార్ట్‌నర్ సంజయ్ కొఠారి అన్నారు.

కంపెనీల మధ్య జరిగే ఒప్పందాలు, పండుగ సీజన్ కోసం కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో మొత్తం ఆన్‌లైన్ అమ్మకాల్లో మొబైల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలు అత్యధిక వాటాను కలిగి ఉంటాయని రెడ్‌సీర్ నివేదిక వెల్లడించింది.

Also Read: Apple iPhone 14ధర ఇండియాలో ఎంతో తెలుసా? 

Tags:    

Similar News