Indian Overseas Bank: రిటైల్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్లు ప్రారంభించిన ఐఓబీ

కీలక నగరాల్లో రిటైల్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్లను ప్రారంభించింది.

Update: 2024-10-13 15:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వినియోగదారులకు సులభంగా రుణాలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం పలు కీలక నగరాల్లో రిటైల్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్లను ప్రారంభించింది. రుణాలను ఆమోదించే ప్రక్రియను కమబద్దీకరించి, సమయాన్ని తగ్గించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చెన్నైలో ఫిజికల్ మోడ్‌లో ఎనిమిది సెంటర్ల్‌ను ప్రారంభించగా, మరో ఏడు నగరాల్లో వర్చువల్ విధానంలో ప్రారంభించినట్టు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆదివారం ప్రకటనలో చెప్పారు. 'తమ కొత్త రిటైల్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్లు కేవలం సౌకర్యం కోసమే కాకుండా స్థిరమైన, సమర్థవంతమైన బ్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మించడం కోసం రూపొందించడం జరిగింది. డిజిటల్ సాధనాలు, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్‌ను ఉపయోగించడం ద్వారా మేము రుణాల ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించి, రిస్క్ మేనేజ్‌మెంట్ విషయంలో భరోసాను ఇస్తున్నామని' అజయ్ కుమార్ వివరించారు. ఈ సెంటర్ల ద్వారా రుణాలను ఆమోదించే ప్రక్రియను సులభతరం చేసి, రిటైల్ కస్టమర్లకు వేగంగా, సమర్థవంతమైన సేవలు అందించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, ముంబైలో ఐఓబీ రిటైల్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 

Tags:    

Similar News