2020-22 మధ్య రూ. 24 వేల కోట్ల నష్టం చూసిన విమానయాన రంగం

భారత విమానయాన పరిశ్రమ 2020-22 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 24,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది.

Update: 2023-02-02 10:01 GMT

న్యూఢిల్లీ: భారత విమానయాన పరిశ్రమ 2020-22 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 24,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది. గురువారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, పరిశ్రమ 2020-21లో రూ. 12,479 కోట్లను, 2021-22లో రూ. 11,658 కోట్లను నష్టపోయింది. పరిశ్రమకు మద్దతిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, విమాన ఇంధనం(ఏటీఎఫ్)పై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గింపు నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అంతేకాకుండా డొమెస్టిక్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ సేవలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించామన్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, ఇతర విమానాశ్రయాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న టెర్మినళ్ల విస్తరణ, మార్పులు, ఇతర కార్యకలాపాల కోసం రాబోయే ఐదేళ్లలో రూ. 98 వేల కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా కలిగి ఉంది. విమానయాన రంగానికి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్‌జీఎస్) పథకాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

ఇవి కూడా చదవండి : 'మజా' కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా నాగార్జున

Tags:    

Similar News