Amazon Great Republic Day Sale - Live from 15th - 20th Jan. Huge discount
రిపబ్లిక్ డే పురస్కరించుకుని అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023' ను నిర్వహిస్తుంది
దిశ, వెబ్‌డెస్క్: రిపబ్లిక్ డే పురస్కరించుకుని అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023' ను నిర్వహిస్తుంది. జనవరి 20 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో పలు స్మార్ట్ ఫోన్‌లు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులకు అదనంగా 10 శాతం ఆఫర్ కూడా ఉంది. ప్రస్తుతం ఏ స్మార్ట్ ఫోన్లపై ఎంత ఆఫర్ ఉందో తెలుసుకుందాం.
Xiaomi 11 Lite 5G NE
ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో రూ. 25,999 కే లభిస్తుంది. దాని అసలు ధరపై 24 శాతం తగ్గింపు ఉంది. అదనంగా SBI కార్డు ద్వారా రూ.1000 తగ్గింపు కూడా పొందవచ్చు. ఫోన్ 6.55-అంగుళాల 10-బిట్ AMOLED డిస్‌ప్లేతో పాటు డాల్బీ విజన్ సపోర్ట్‌తో 90Hz రిఫ్రెష్ రేట్లను అందిస్తోంది. Android 11 పై MIUI 12.5 రన్ అవుతుంది. ఫోన్‌లో 64-మెగాపిక్సెల్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5-మెగాపిక్సెల్ సూపర్ మాక్రో సెన్సార్, సెల్ఫీల కోసం 20-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి.
Redmi Note 10S
ఈ ఫోన్ దాని అసలు ధరపై 12 శాతం తగ్గింపుతో రూ. 14,999 కే సేల్‌లో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వస్తుంది. 6GB RAM, 64GB, 128GB స్టోరేజ్ ఆప్షన్‌లలో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ Android 11 పైన MIUI 12.5తో పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీతో, 33W ఛార్జర్‌తో వస్తుంది.
Samsung Galaxy M32
Samsung Galaxy M32 స్మార్ట్‌ఫోన్ రూ. 13,499 కే అందుబాటులో ఉంది. అసలు ధర కంటే 21 శాతం తగ్గింపుతో లభిస్తుంది. అదనంగా SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి 1,000 తగ్గింపు పొందవచ్చు.
Oppo A31
ఈ ఫోన్ అసలు ధర రూ. 15,990, కానీ ఈ సేల్‌లో రూ. 12,490 కే అందుబాటులో ఉంది. ఇది 6.5-అంగుళాల వాటర్‌డ్రాప్ మల్టీ-టచ్ స్క్రీన్‌తో 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 1600x720 పిక్సెల్‌ల రిజల్యూషన్ కలిగి ఉంది. ColorOS 6.1 ఆధారంగా Android Pie v9.0పై రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ 4,230mAh బ్యాటరీతో వస్తుంది.