Hero MotoCorp: హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం.. మూడు బైకులకు గుడ్‌బై..!
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన మూడు మోటార్ సైకిళ్ల ఉత్పత్తిని(Production) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన మూడు మోటార్ సైకిళ్ల ఉత్పత్తిని(Production) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 200సీసీ కేటగిరీలో ఎక్స్‌ట్రీమ్ 200S 4v, హీరో ఎక్స్‌పల్స్ 200T మోడళ్లతో పాటు, కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యంత ఆదరణ పొందిన ప్యాషన్ ఎక్స్‌టెక్ బైక్ కు కూడా గుడ్‌బై(Good Bye) చెప్తూ నిర్ణయం తీసుకుంది. ఆశించిన స్థాయిలో ఈ బైక్ విక్రయాలు(Sales) లేకపోవడం వల్లే ఈ డెషిషన్ తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆయా మోడళ్లను తొలగించింది. కాగా హీరో మోటోకార్ప్ 200సీసీ సెగ్మెంట్‌లో ఎక్స్‌పల్స్ 200 4v, ఎక్స్‌పల్స్ 200T, ఎక్స్‌ట్రీమ్ 200S 4v బైక్స్‌ను సేల్ చేస్తోంది. అయితే, ఇందులో ఎక్స్‌పల్స్ 200 4v మినహా మిగిలిన రెండు మోడళ్ల ప్రొడక్షన్ నిలిపివేసింది. ఎక్స్‌పల్స్ 200 4v ఉత్పత్తి కూడా హీరో త్వరలో నిలిపివేయవచ్చని, దాని ప్లేసులో కొత్త ఎక్స్‌పల్స్ వేరియంట్ పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.