Nemo EV Scooter: రూ. 99,000 ప్రారంభ ధరతో 'నెమో' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. స్పెసిఫికేషన్ వివరాలివే..!

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వార్డ్విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్(WIML) కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది.

Update: 2024-12-15 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వార్డ్విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్(WIML) కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. 'నెమో(Nemo)' పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్(Indian Market)లో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ. 99,000(Ex-Showroom)గా నిర్ణయించారు. సిల్వర్ అండ్ వైట్ కలర్ లో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో లిథియం-అయాన్(Lithium-ion) ఎన్ఎంసీ బ్యాటరీ(NMC Battery) ప్యాక్ ఉపయోగించారు. ఒక ఫుల్ ఛార్జ్‌తో ఈ వాహనం 130 కిలోమీటర్ల దూరం వరకు ట్రావెల్ చేయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 65 కిలో మీటర్లు. ఇక ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండు వైపులా హైడ్రాలిక్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. మరోవైపు ఈ స్కూటర్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, 5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT డిస్ప్లేతో వస్తుంది. ఇందులో యుఎస్బి పోర్ట్, రివర్స్ అసిస్ట్ కూడా ఉన్నాయి.


Similar News