Onions Prices Hike: సామాన్యులకు మరో బిగ్ షాక్.. మరింత పెరగనున్న ఉల్లిగడ్డల ధరలు..!

దేశవాప్తంగా పెరిగిన నిత్యావసర ధరల(Essential prices)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు మరో బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-12-15 03:58 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: దేశవాప్తంగా పెరిగిన నిత్యావసర ధరల(Essential prices)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే నూనె(Oil), సబ్బుల(Soaps) ధరలు పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న సామాన్యులపై మరో భారం పడనుంది. త్వరలోనే ఉల్లిగడ్డ(Onions) ధరలు భారీగా పెరగబోతున్నాయట. మరో వారం, పది రోజుల్లో కేజీ ఉల్లిగడ్డ ధర రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ ఉల్లిగడ్డ ధర రూ.70 నుంచి రూ.80 మధ్య పలుకుతోంది. వారం రోజుల కిందటి వరకు కేజీకి రూ.30 నుంచి రూ.40గా ఉండేది. కానీ ఒక్క సారిగా 70 రూపాయల వరకు పెంచారు. దేశవ్యాప్తంగా ఉల్లి సాగు తగ్గడం, అలాగే మార్కెట్లోకి సరిపడా ఉల్లిగడ్డలు రాకపోవడం కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఉల్లిగడ్డల స్టాక్(Stack) లేదని.. వచ్చే రెండు, మూడు నెలలు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు. 


Similar News