Skoda Kylaq: రికార్డు సృష్టించిన స్కోడా కైలాక్ ఎస్‌యూవీ.. కేవలం 10 రోజుల్లోనే 10 వేల బుకింగ్స్..!
చెక్ రిపబ్లిక్(Czech Republic)కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ స్కోడా(Skoda) ఇటీవలే కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కైలాక్(Kylaq)ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: చెక్ రిపబ్లిక్(Czech Republic)కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ స్కోడా(Skoda) ఇటీవలే కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కైలాక్(Kylaq)ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రూ. 7.89 లక్షల ప్రారంభ ధరతో దీన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని బుకింగ్స్(Bookings) ఈ నెల 2న ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నుంచి డెలివరీలు(Deliverys) అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. కేవలం 10 రోజుల్లోనే ఈ కారు 10 వేల బుకింగ్స్ కు చేరుకున్నాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. స్కోడా కార్లకు ఈ విధమైన బుకింగ్స్ రావడం ఇదే తొలిసారి అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్రా జనేబా(Petra Janeba) పేర్కొన్నారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. స్కోడా కైలాక్‌లో 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ 114 బీహెచ్‌పీ పవర్, 178 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక కీలెస్ ఎంట్రీ, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 3-పాయింట్ సీట్ బెల్ట్ వంటివి ఉన్నాయి. ఇవేగాక బ్యాక్ సైడ్ ఏసీ వెంట్ లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.