జులై 1 నుంచి అమల్లోకి రానున్న హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనం!

దేశ కార్పొరేట్‌ చరిత్రలో కీలకంగా భావిస్తున్న మోర్టగేజ్‌ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుంది.

Update: 2023-06-27 10:31 GMT

ముంబై: దేశ కార్పొరేట్‌ చరిత్రలో కీలకంగా భావిస్తున్న మోర్టగేజ్‌ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ) ఛైర్మన్ దీపక్ పరేఖ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ విలీనాన్ని ఆమోదించేందుకు జూన్ 30న ఇరు సంస్థల బోర్డులు సమావేశం నిర్వహించనున్నాయి.

ఇప్పటికే ఈ విలీనానికి అన్ని రకాల నియంత్రణ ఆమోదాలు లభించాయని దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. జూన్ 30న ఆఫీస్ పనివేళల తర్వాత రెండు సంస్థల బోర్డులు సమావేశం కానున్నాయి. ఇది హెచ్‌డీఎఫ్‌సీకి చివరి బోర్డు సమావేశమవుతుందని ఆయన తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్స్ డీలిస్టింగ్ జులై 13 నుంచి అమల్లోకి వస్తుందని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కింద ట్రేడింగ్ అవుతుందని సంస్థ వైస్-ఛైర్మన్, సీఈఓ కెకి మిస్త్రీ చెప్పారు.

జులై 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన అన్ని సెంటర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన సేవా కేంద్రాలుగా పనిచేయనున్నాయి. భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద విలీనంగా ఉన్న ఈ విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆర్థిక సేవల రంగంలో ఆధిపత్యం కలిగి ఉండనుంది. విలీనం తర్వాత ఏర్పడబోయే సంస్థ దాదాపు రూ. 18 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంటుంది. ఈ విలీనం కారణంగా ప్రతి 25 హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ఉన్న మదుపర్లు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లను పొందనున్నారు.

Read more: LIC కొత్త పాలసీ: సింగిల్ ప్రీమియంతో జీవిత బీమా ప్లాన్ 

Tags:    

Similar News