Gold Loans: గత ఏడు నెలల్లో 50 శాతం పెరిగిన గోల్డ్ లోన్స్.. తగ్గిన పర్సనల్ లోన్స్..!

మనదేశంలో బంగారాని(Gold)కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-12-01 11:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: మనదేశంలో బంగారాని(Gold)కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు(Money) అవసరం అయినప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్స్(Loans) తీసుకుంటారు. అలాగే హోమ్ లోన్స్(Home Loans), పర్సనల్ లోన్స్(Personal Loans) కంటే గోల్డ్ లోన్స్(Gold Loans)పై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఇక ఇతర లోన్లతో పోల్చితే గోల్డ్ లోన్స్ చాలా సురక్షితమని చెప్పవచ్చు. దీంతో బంగారం మీద రుణాలు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

ఇదిలా ఉంటే 2024-25(FY24-25) ఆర్ధిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో గోల్డ్ లోన్స్ 50 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి బంగారు రుణాలు రూ. 1,02,562 కోట్లు ఉండగా.. అక్టోబర్ 18 వరకు రూ. 1,54,282 కోట్లకు చేరినట్లు తెలిపింది. మరోవైపు హోమ్ లోన్స్ కూడా 12.1 శాతం పెరిగియాని పేర్కొంది. గత నెల చివరి వరకు దేశవ్యాప్తంగా రూ. 28.7 లక్షల కోట్ల హోమ్ లోన్స్ తీసుకున్నారని వెల్లడించింది. అయితే పర్సనల్ లోన్స్ మాత్రం 3.3 శాతం తగ్గాయంది. మొత్తం మీద అన్ని రకాల బ్యాంకింగ్ లోన్స్(Banking Loans) 4.9 శాతం పెరిగి రూ. 172.4 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వివరించింది.

Tags:    

Similar News