రూ. 1.14 లక్షల కోట్ల టాక్స్‌ను రీఫండ్‌‌ చేసిన ఆదాయపు పన్ను శాఖ

ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31, 2022 మధ్య 1.97 కోట్ల కంటే ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులకు రూ. 1.14 లక్షల కోట్లకు పైగా టాక్స్ రీఫండ్‌లను..Latest Telugu News

Update: 2022-09-03 07:24 GMT

ముంబై: ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31, 2022 మధ్య 1.97 కోట్ల కంటే ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులకు రూ. 1.14 లక్షల కోట్లకు పైగా టాక్స్ రీఫండ్‌లను జారీ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) 1,96,00,998 కేసుల్లో రూ. 61,252 కోట్ల రీఫండ్‌లను జారీ చేసింది. 1,46,871 కేసుల్లో రూ. 53,158 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్‌లు జారీ చేసినట్లు ఆ శాఖ వెల్లడించింది.

ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కార్పొరేట్ పన్ను వసూళ్లు 34% వేగవంతమైన వృద్ధిని కనబరిచినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. CBDT చైర్మన్ నితిన్ గుప్తా మాట్లాడుతూ.. "బడ్జెట్‌లో రూ. 14.20 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాము, ప్రస్తుతం ప్రత్యక్ష పన్ను వసూళ్ల ట్రెండ్ చాలా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు".

ఇప్పటి వరకు దాదాపు రూ. 4.80 లక్షల కోట్ల నికర వసూళ్లు వచ్చాయి. స్థూల వసూళ్లు గతేడాది కంటే 38% ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది రూ. 52,000 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ. 93,000 కోట్ల పన్ను రీఫండ్‌లు విడుదల చేశామని గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసం ITR-U అనే కొత్త రిటర్న్ ఫైలింగ్ ఫారమ్‌‌ను తీసుకొచ్చారు. ITR-U అంటే 'ఆదాయపు పన్ను రిటర్న్-అప్‌డేటెడ్'. ఇది పన్ను చెల్లించే వారికి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా సకాలంలో పన్ను చెల్లించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News