త్వరలో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజు రెట్టింపు

మార్జిన్‌లను మెరుగుపరుచుకునేందుకు ప్లాట్‌ఫామ్ ఫీజును రెట్టింపు చేయనున్నట్టు తెలుస్తోంది.

Update: 2024-01-23 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఈ ఏడాది చివర్లో పబ్లిక్ లిస్టింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో మార్జిన్‌లను మెరుగుపరుచుకునేందుకు వినియోగదారులపై భారం మోపనుంది. త్వరలో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజును రెట్టింపు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 5గా ఉన్న ఫీజును రూ. 10కి పెంచనుందని కథనాలు వస్తున్నాయి. అధికారికంగా కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ, కొంతమంది కస్టమర్లకు ఆర్డర్ బిల్లులో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 10గా చూపించి రూ. 5 వసూలు చేసినట్టు సమాచారం. గతేడాది ఏప్రిల్‌లో స్విగ్గీ ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రతి ఆర్డర్‌పై రూ. 2 చొప్పున ఫీజును విధించగా, వినియోగదారుల నుంచి ఆర్డర్లు మాత్రం తగ్గలేదు. దీంతో ప్లాట్‌ఫామ్ ఫీజును కొనసాగిస్తూ, రూ. 5కి పెంచింది. మరికొద్ది రోజుల్లో దీన్ని రూ. 10 చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచడం ద్వారా కంపెనీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలదని, ఐపీఓకు ముందు ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది.

Tags:    

Similar News