Flipkart Big Diwali Sale: అక్టోబర్ 21 నుంచి ఫ్లిప్ కార్ట్ 'బిగ్ దీపావళి సేల్' ప్రారంభం.. రూ.49,999కే ఐఫోన్ 15..!

ఆన్​లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త.

Update: 2024-10-19 16:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆన్​లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్(Flipkart) మరో సేల్ కు సిద్ధమైంది. కాగా దసరా పండగ సందర్భంగా ఇటీవలే ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్(Big Billion Days) సేల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో దీపావళి ఫెస్టివల్(Diwali Festival) సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ దీపావళి సేల్(Big Diwali Sale) పేరుతో మరో సేల్(Another sale)ను తీసుకురానుంది. అక్టోబర్ 21 నుంచి ఈ సేల్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఫ్లిప్​కార్ట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారికి 20 నుంచే ఈ సేల్ అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది.

ఫ్లిప్​కార్ట్ బిగ్​ దీపావళి ​సేల్​లో భాగంగా వివిధ రకాల మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ​భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్(Instant Discount) అందిస్తున్నట్లు తెలిపింది. ఫ్లిప్​కార్ట్​ దీపావళి ​బిగ్ సేల్​లో ఐఫోన్ 15(iPhone 15)పై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్​లో ఐఫోన్ 15 ధర రూ.69,900గా ఉంది. కానీ ఈ దీపావళి సేల్​లో ఐఫోన్ 15 రూ.49,999కే లభించనుంది. అలాగే యాపిల్ ఎయిర్​పాడ్స్(Apple AirPods)ను కేవలం రూ. 9,999 కంటే తక్కువకు కొనుగోలు చేయొచ్చని ఫ్లిప్​కార్ట్ తెలిపింది. ఇక మ్యాక్ బుక్ ఎయిర్ ఎం2(MacBook Air M2) మీద కూడా డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23Samsung Galaxy S23 ఫోన్ రూ.37,999, గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ(Galaxy S23 FE) రూ.29,249లకు లభిస్తాయని పేర్కొంది.మరోవైపు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో(Motorola Edge 50 Pro)ఫోన్ రూ.29,999, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్(Motorola Edge 50 Fusion) ఫోన్ రూ.21,999, మోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo) ఫోన్ రూ.23,999 లకే ఈ సేల్ లో సొంతం చేసుకోవచ్చు.  


Similar News