Toyota Glanza: టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ కారు లాంచ్.. ధర రూ.6.68 లక్షల నుంచి ప్రారంభం

జపాన్(Japan)కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా(Toyota).. ఇండియన్ మార్కెట్(Indian market)లో కొత్త ఎడిషన్ కారును విడుదల చేసింది.

Update: 2024-10-19 17:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: జపాన్(Japan)కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా(Toyota).. ఇండియన్ మార్కెట్(Indian market)లో కొత్త ఎడిషన్ కారును విడుదల చేసింది. ‘గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్(Glanza Festival Edition)’ పేరుతో ఈ కారును లాంచ్ చేసింది. దీని ధరను రూ.6.68 లక్షల (Ex showroom-Delhi) నుంచి రూ.9.99 లక్షలగా కంపెనీ నిర్ణయించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. క్రోమ్, బ్లాక్ బాడీ సైడ్ మోల్డింగ్, బ్యాక్ డోర్ గార్నిష్ పై క్రోమ్ యాక్సెంట్లు ఓఆర్వీఎంస్ గార్నిష్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ నెలాఖరు వరకూ ఈ కారును బుక్ చేసుకుంటే రూ.20,567 విలువైన యాక్సెసరీలను(Accessories) కస్టమర్లు పొందుతారు. అలాగే 3డీ ఫ్లోర్ మ్యాట్స్, ప్రీమియం డోర్ వైజర్లు , బ్లాక్ అండ్ సిల్వర్ రంగుల్లో నెక్ కుషన్స్, వెల్ కం డోర్ ల్యాంప్ తదితర ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.

టయోటా గ్లాంజా(Toyota Glanza) అనేది మారుతి సుజుకి బాలెనో(Maruti Suzuki Baleno) రీబ్రాండెడ్ వర్షన్. ఈ కొత్త ఎడిషన్ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్(Petrol engine)తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 88 హార్స్ పవర్(88 HP), 113 ఎన్ఎమ్ టార్క్(113 Nm Torque)ను రిలీజ్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్(5-speed Manual Gear Box)తో వస్తుంది. ఇందులో CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. కాగా దేశవ్యాప్తంగా టయోటా షోరూమ్‌(Toyota showroom)ల వద్ద గ్లాన్జా ఫెస్టివ్ ఎడిషన్ కార్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే ఈ నెల ప్రారంభంలో టయోటా తన అర్బన్ క్రూయిజర్ హై రైడర్(Urban Cruiser High Rider), టైసార్ ఫెస్టివ్ ఎడిషన్ (Taisor Festive Edition) కార్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.


Similar News