Afcons Infrastructure IPO: ఐపీఓకు సిద్ధమైన ఆఫ్కాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. పూర్తి వివరాలు ఇవే..

ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-19 15:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం సంస్థలు లైన్ కడుతున్నాయి. తాజాగా దిగ్గజ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్(Shapoorji Pallonji Group)కు చెందిన ఆఫ్కాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Afcons Infrastructure Ltd) కూడా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు సిద్దమైంది. ఐపీఓ ద్వారా సుమారు రూ. 5,430 కోట్లను ఆ సంస్థ సమీకరించనుంది . ఇందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ అక్టోబర్ 25న ప్రారంభమై 29న బిడ్డింగ్ ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు(Anchor Investors) అక్టోబర్ 24నే విండో తేర్చుకోనుంది. లాట్ సైజ్, షేర్ల ధరను కంపెనీ వచ్చే వారం ప్రకటించనుంది. కాగా ఆఫ్కాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో కంపెనీ ప్రమోటర్లు , ప్రమోటర్ గ్రూప్ ఎంటీటీలు 99 శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 600 కోట్లను లోన్స్ కట్టేందుకు, 320 కోట్లను లాంగ్‌-టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం, రూ. 80 కోట్లను నిర్మాణ సామాగ్రి కోసం, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.     


Similar News