కర్వా చౌత్.. మార్కెట్‌లో జోష్
ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాల్లో కర్వా చౌత్ పండుగ ఫేమస్. ఇప్పుడు ఈ పండుగ ఇతర రాష్ట్రాలకూ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. పండుగ వ్యాప్తి చెందినప్పుడు ఆర్థికాంశాలు వృద్ధి చెందడాన్ని అంచనా వేయవచ్చు. గతేడాది ఈ పండుగ రోజున దేశవ్యాప్తంగా సుమారు రూ. 15 వేల కోట్ల బిజినెస్ అయింది. ఈ సారి ఇది రూ. 22 వేల కోట్లకు పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాల్లో కర్వా చౌత్ పండుగ ఫేమస్. ఇప్పుడు ఈ పండుగ ఇతర రాష్ట్రాలకూ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. పండుగ వ్యాప్తి చెందినప్పుడు ఆర్థికాంశాలు వృద్ధి చెందడాన్ని అంచనా వేయవచ్చు. గతేడాది ఈ పండుగ రోజున దేశవ్యాప్తంగా సుమారు రూ. 15 వేల కోట్ల బిజినెస్ అయింది. ఈ సారి ఇది రూ. 22 వేల కోట్లకు పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బిజినెస్ అంచనాలతోనే కర్వా చౌత్ పండుగ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నదో సులువుగా అర్థం చేసుకోవచ్చు. పండుగను పురస్కరించుకుని నేడు మార్కెట్ కలకలలాడనుంది. ఆభరణాలు, సాంప్రదాయ వస్త్రాలు, అలంకార వస్తులు, మేకప్ వస్తువులు, పూజా సామాగ్రి ఎక్కువగా సేల్ కానున్నాయి. ఈ ఏడాది మార్కెట్‌లోకి వెండి జల్లెడను ప్రవేశపెట్టారు. దీనికి ఎక్కువ డిమాండ్ ఉండే చాన్స్ ఉన్నది. ఒక్క ఢిల్లీలోనే ఈ పండుగ బిజినెస్ రూ. 4 వేల కోట్లకు చేరే అంచనాలున్నాయి. మెహెందీకి, మెహెందీ ఆర్టిస్టులకూ ఫుల్ డిమాండ్ ఉండనుంది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ప్రత్యేకంగా మెహెందీ పెట్టడానికి స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.
తన భర్త దీర్ఘకాలం జీవించాలని హిందూ వివాహిత కర్వా చౌత్ నాడు ఉపవాసం ఉంటారు. రాత్రి జల్లెడలో చంద్రుడిని చూసిన తర్వాత తన భర్తను చూసి ఉపవాసాన్ని విరమించుకుంటారు. కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఈ పండుగ జరుపుకుంటారు. రానున్న పెళ్లి సీజన్ డిమాండ్‌ను ఈ పండుగ బిజినెస్‌తో ఓ అంచనా వేస్తారు.